శనివారం, 9 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (16:06 IST)

అల్లరి నరేష్ బర్త్ డే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్

Naresh still
Naresh still
అభివృద్ధికి దూరంగా ఉండే గిరిజ‌న గ్రామాలు.. జీవితంలో ఓసారి కూడా ఓటు వేయ‌ని ప్ర‌జ‌లు.. సాయం కోసం ఎదురు చూసే అమ‌యాకులు.. అలాంటి వారిని ఓటు వేయ‌మ‌ని చెప్ప‌డానికి కొంద‌రు అధికారులు వెళ‌తారు. ఈ క్ర‌మంలో వారికి అక్క‌డ ఎదుర‌య్యే ప‌రిస్థితులు ఏంటి?
గిరిజ‌నుల‌కు జ‌రిగిన అన్యాయం ఏంటి?  న్యాయం కోసం వారేం చేశారు?  గిరిజ‌నుల‌కు అండ‌గా నిల‌బ‌డిన అధికారి ఎలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నాడు?
 
ఈ విష‌యాల‌ను తెలుసుకోవాలంటే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. గురువారం (జూన్ 30) అల్లరి నరేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా నుంచి టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ గమనిస్తే అందులో అమాయకులైన గిరిజనులకు న్యాం చేయటం కోసం అల్లరి నరేష్ ఎలాంటి కష్టాలు పడ్డాడనేదే సినిమా అని తెలుస్తోంది. మన దేశం అభివృద్ధి చెందుతుంద‌ని అందరం అనుకుంటున్నాం. అయితే చిన్న ఆరోగ్య స‌మ‌స్య వ‌స్తే .. మైళ్ల దూరాలు కాలి న‌డ‌క‌న వెళ్లాల్సిన ఊళ్లు ఇంకా ఉన్నాయి. అలాంటి ఊళ్ల‌లోని ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను ఆవిష్క‌రించే ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం అని అర్థ‌మ‌వుతుంది.
 
సాధారణంగా అల్లరి నరేష్ అంటే కామెడీ చిత్రాలే కాదు..విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గమ్యం, నాంది వంటి వైవిధ్య‌మైన క‌థాంశాలున్న చిత్రాల్లోనూ న‌టించి న‌టుడిగా మెప్పించారాయ‌న‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’.
 
సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, రిప‌బ్లిక్‌, బంగార్రాజు వంటి వ‌రుస స‌క్సెస్‌ఫుల్ మూవీస్‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌, నిర్మాణంలో, మ‌రో నిర్మాణ‌ హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎ.ఆర్‌.మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి రాజేష్ దండ నిర్మాత‌. బాలాజీ గుత్త స‌హ నిర్మాత‌. ఆనంది హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియజేశారు.