గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (17:11 IST)

నాంది ద‌ర్శ‌కుడితో అల్లరి నరేష్ చిత్రం

Allari Naresh, Vijay Kanakamedala
Allari Naresh, Vijay Kanakamedala
హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన 'నాంది' చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందటంతో పాటు కమర్షియల్ సక్సెస్ అందుకుంది. తాజాగా నరేష్, విజయ్ కలయికలో రెండో చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు.
కృష్ణార్జున యుద్ధం, మజిలీ, గాలి సంపత్, టక్ జగదీష్ వంటి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను నిర్మించిన నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 5గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
 
ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. రక్తపు మరకలతో నిండిన సంకెళ్ళు వేసిన చేతులు, ఆ చేతుల నీడ గోడపై స్వేఛ్చగా ఎగిరే ఒక పక్షిలా కనిపించడం ఇంటరెస్టింగ్ గా వుంది. హై ఇంటెన్సిటీ తో కూడుకున్న ఈ పోస్టర్ క్యూరియాసిటీని పెంచింది.     
తన తొలి చిత్రాన్ని విలక్షణమైన కథతో తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కనకమేడల రెండవ సినిమా కోసం పవర్ ఫుల్ కథను సిద్దం చేశారు. ఈ చిత్రం న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది ఈ సినిమాలో నరేష్ మరో ఇంటెన్స్ రోల్ లో కనిపించనున్నారు.
అల్లరి నరేష్ , విజయ్ కనకమేడల క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం నరేష్ చేస్తున్న ''ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'' పూర్తయిన తర్వాత ప్రారంభమవుతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక విభాగం వివరాలు త్వరలో నిర్మాతలు వెల్లడించనున్నారు.