అల్లరి నరేష్ "సెల్ఫీ రాజా" ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ జయంతి సందర్భంగా అల్లరి నరేష్ హీరోగా సుంకర రామబ్రహ్మం సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఫేమ్ జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘సెల్ఫీరాజా’. గోపీ ఆర్ట్స్ బ్యానర్‌పై చలసాని రామబ్రహ్మం చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విజయ్ మాల్యాతో అల్లరి నరేష్ దిగిన సెల్ఫీ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. జూన్ 10న ఈవీవీ సత్యనారాయణ జయంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ను విడుదల చేశారు.