శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో, "పుష్ప 2" నిర్మాతలు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ ప్రముఖులు సందర్శిస్తున్నారు.
నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, దర్శకుడు సుకుమార్‌లు శ్రీతేజ్, అతని తండ్రిని కిమ్స్ ఆసుపత్రిలో కలిశారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, అల్లు అరవింద్ శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల పరిహారం ప్రకటించారు.
అల్లు అర్జున్ రూ.1 కోటి విరాళంగా ఇచ్చారని, మిగిలిన రూ1 కోటిని "పుష్ప 2" నిర్మాతలు, సుకుమార్ కలిసి అందించారని, ఒక్కొక్కరు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారని ఆయన వివరించారు. ఇకపోతే.. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, ఆయనకు వెంటిలేటర్ సపోర్ట్ తొలగించబడిందని అల్లు అరవింద్ తెలిపారు.