చిరుపై జనంలో అభిమానం తగ్గలేదండోయ్.. తొలి రోజే భారీ కలెక్షన్లు: అల్లు అరవింద్
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' సినిమా తొలి రోజే భారీ కలెక్షన్లను మూటగట్టుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తొలిరోజు చిత్ర కలెక్షన్ల వివరాలను వెల్లడించారు. చిరంజీవిపై
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' సినిమా తొలి రోజే భారీ కలెక్షన్లను మూటగట్టుకుంది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తొలిరోజు చిత్ర కలెక్షన్ల వివరాలను వెల్లడించారు. చిరంజీవిపై జనంలో అభిమానం తగ్గలేదని, 'ఖైదీ నంబర్ 150' విడుదల సందర్భంగా మస్కట్‌లో బుధవారం చాలా కంపెనీలు సెలవు కూడా ఇచ్చాయని అల్లు అరవింద్ పేర్కొన్నారు.
తెలుగు సినిమాల్లో తొలిరోజు అత్యధికంగా గ్రాస్‌ను వసూలు చేసిన చిత్రంగా 'ఖైదీ నంబర్ 150' నిలిచిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజు రూ.47.7కోట్లు వసూలు చేసిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.30.04కోట్లు, కర్ణాటకలో రూ.4.72కోట్లు, ఓవర్సీస్(అమెరికా) 1.22 మిలియన్ డాలర్లు, మిగిలిన దేశాల్లో సుమారు రూ.2.12కోట్లు వసూలు చేసిందని అల్లు అరవింద్ వివరించారు. గతంలోలా కాకుండా రెండు, మూడు వారాల్లో కలెక్షన్లు పూర్తవుతున్నాయన్నారు.