శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By tj
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2017 (11:53 IST)

తిరుపతిలో రెచ్చిపోయిన అల్లు అర్జున్ అభిమానులు.. ఏం చేశారు..!

తిరుపతిలో అల్లు అర్జున్ అభిమానులు రెచ్చిపోయారు. స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ నటించిన "దువ్వాడ జగన్నాథమ్" సినిమా ఫ్యాన్సీ షో వేయలేదని అభిమానులు ఆందోళనకు దిగారు. గ్రూప్ థియేటర్ల వద్ద అభిమానులు పోస్టర్

తిరుపతిలో అల్లు అర్జున్ అభిమానులు రెచ్చిపోయారు. స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ నటించిన "దువ్వాడ జగన్నాథమ్" సినిమా ఫ్యాన్సీ షో వేయలేదని అభిమానులు ఆందోళనకు దిగారు. గ్రూప్ థియేటర్ల వద్ద అభిమానులు పోస్టర్లను చించేసి తగులబెట్టేశారు. అంతటితో ఆగకుండా భూమా సినీ కాంప్లెక్స్ అద్దాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టారు. ఫ్యాన్సీ షో వేస్తామని ముందు థియేటర్లు చెప్పి ఆ తర్వాత షోను ప్రదర్శితం చేయకపోవడంతో అభిమానులు మండిపడ్డారు. 
 
థియేటర్ల ముందు ఆందోళన చేపట్టారు. అభిమానుల ఆందోళనతో థియేటర్లు తిరుపతిలో 8 గంటలకు షోను ప్రదర్శించారు. థియేటర్ల వద్ద పోలీసులు పహారా కాశారు. ఇదిలావుంటే సినిమా టిక్కెట్లు బ్లాక్‌లో విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. కొన్ని థియేటర్ల యజమానులైతే స్వయంగా కొంతమందిని ఏర్పాటు చేసుకుని బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయించేస్తున్నారు.