శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2024 (13:13 IST)

Allu Arjun arrested: అల్లు అర్జున్ అరెస్ట్.. స్నేహారెడ్డికి ధైర్యం చెప్తూ వెళ్లిన? (video)

Allu Arjun
Allu Arjun
పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై చిక్కడపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంసలో శుక్రవారం బన్నీని అరెస్ట్ చేసి పోలీసులు చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు. అయితే ఇది అరెస్ట్ కాదని, కేవలం విచారణకు మాత్రమే అల్లు అర్జున్‌ను పోలీసులు తీసుకెళ్లారని ఆయన పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా స్నేహారెడ్డి బాధపడుతుంటే.. బన్నీ ధైర్యం చెప్తూ వెళ్లిపోయాడు. 
 
ఇప్పటకే ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హీరో అల్లు అర్జున్‌  డిసెంబరు 11 బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనలో మహిళ మృతి చెందడం బాధాకరం అన్నారు. 
 
సినిమా విడుదల సందర్భంగా తాను థియేటర్‌కు రావడం సహజం అని గతంలోనూ చాలాసార్లు హాజరయ్యాను కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చోటుచేసుకోలేదన్నారు. తాను థియేటర్ దగ్గరకు వస్తున్నట్టు థియేటర్‌ నిర్వాహకులకు, ఏసీపీకి సమాచారం ఇచ్చానన్నారు బన్నీ. 
 
దీంతో న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌‌ని చిక్కడపల్లి పోలీసులు నిందితుల లిస్ట్‌లో చేర్చారు. బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కాని ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే ఐదు నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది.