1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2016 (10:27 IST)

బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అల్లు అర్జున్ మళ్లీ తండ్రయ్యాడోచ్.. ఒక అమ్మాయి.. ఒక అబ్బాయి...

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండోసారి తండ్రి అయ్యాడు. బన్నీ సతీమణి స్నేహారెడ్డి సోమవారం రాత్రి హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చారు. నాలుగేళ్ల క్రితం బన్నీ-స్నేహార

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండోసారి తండ్రి అయ్యాడు. బన్నీ సతీమణి స్నేహారెడ్డి సోమవారం రాత్రి హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనిచ్చారు. నాలుగేళ్ల క్రితం బన్నీ-స్నేహారెడ్డి దంపతులు మగ బిడ్డ అయాన్ పుట్టిన సంగతి తెలిసిందే. ఈసారి తనకు పాప పుట్టినందుకు అల్లు అర్జున్ పండగ చేసుకుంటున్నాడు. 
 
ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.. తండ్రిగా ఇంతకు మించి ఆనందం ఏముంటుంది అంటూ స్టైలిష్ స్టార్ పొంగిపోతున్నాడు. ఈ మేరకు తన ట్విట్టరు ద్వారా బన్నీ తన అభిమానులకు శుభవార్త తెలిపాడు. తాను చాలా అదృష్టవంతుడిని వెల్లడించాడు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. 
 
కాగా స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమించిన పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. 2014లో ఈ దంపతులకు అయాన్ పుట్టిన సంగతి తెలిసిందే. అయాన్ అల్లరి చేష్టలను అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా పాప పుట్టడంతో బన్నీ  సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.