1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (11:24 IST)

అల్లు అర్జున్ కొత్త చిత్రం పేరు 'డీజే' (దువ్వాడ జగన్నాథమ్)

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్, హరీష్‌శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం డీజే (దువ్వాడ జగన్నాథమ్). ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యా

టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్, హరీష్‌శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం డీజే (దువ్వాడ జగన్నాథమ్). ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. 
 
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బన్నీపై క్లాప్ కొట్టగా.. శ్యాంప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. బన్నీకి గతంలో సూపర్‌హిట్ సాంగ్స్ అందించిన దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి మరోసారి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. దర్శకుడు వంశీపైడిపల్లి ఇతర ప్రముఖులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా హరీష్‌శంకర్ మాట్లాడుతూ దిల్‌రాజుగారి బ్యానర్‌లో వస్తున్న 25వ సినిమా ఇది. దిల్‌రాజుతో తన అనుబంధం 'గబ్బర్‌సింగ్‌' నుంచి కొనసాగుతుందన్నారు. 'ఆర్య' సినిమా వచ్చినప్పటి నుంచి అల్లుఅర్జున్‌తో సినిమా చేయాలని అనుకున్నా.. ఇప్పటికి ఆ కోరిక తీరిందని వెల్లడించారు.