శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జులై 2018 (09:23 IST)

హల్లో విజయ్.. నీకోసం రాలేదమ్మా.. బన్నీవాసు ఆప్తుడు అందుకే వచ్చా : అల్లు అర్జున్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా 'గీత గోవిందం'. పరుశురాం దర్శకత్వంలో తెరకెకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా

యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా 'గీత గోవిందం'. పరుశురాం దర్శకత్వంలో తెరకెకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. గోపిసుందర్ సంగీతం సమకూర్చారు. ఆగష్టు 15న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ  సినిమా ఆదివారం ఆడియో రిలీజైంది.
 
ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చి ఆడియోను రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, 'విజయ్ సారీ.. నీ కోసం రాలేదు. నాకు ఎంతో ఆప్తుడైన బన్నీ వాసు కోసమే వచ్చాను' అని నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఒక ఆడియన్‌గా ఈ సినిమా చూసాను.. చాలా బాగుంది అని చెప్పాడు. 
 
ముఖ్యంగా, ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన బాగా నటించారని తెలిపారు. 'ఇంకేం ఇంకేం కావలి' అనే సాంగ్ బాగా నచ్చింది. పరుశురాం ఈ సినిమా మీకు బెస్ట్ అవుతుందన్నారు. రష్మిక మందనకు ఈ సినిమాలో మంచి నటన కనపరిచింది అని చెప్పారు. 'అర్జున్ రెడ్డి' చిత్రం చూశాక వారం రోజులు నిద్రపట్టలేదని బన్నీ చెప్పుకొచ్చాడు.