ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 15 జూన్ 2017 (06:53 IST)

సన్యాసినిగా మారి హిమాలయాలకు వెళ్లతానని చెప్పానా.. మళ్లీ ప్రేమ పెళ్ళే అంటున్న కుర్రనటి

చాలా చిన్న వయస్సులో మలయాళీ చిత్ర దర్శకుడు విజయ్‌ని 2015లో ప్రేమించి పెళ్లాడిన అమలాపాల్ వైవాహిక జీవితం ఏడాదిలోపే ముగిసిపోయింది. దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే ఉన్నట్లుండి భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకోవడంతో ఆమె పని ఇక ముగిసిపోయినట్లేన

చాలా చిన్న వయస్సులో మలయాళీ చిత్ర దర్శకుడు విజయ్‌ని 2015లో ప్రేమించి పెళ్లాడిన అమలాపాల్ వైవాహిక జీవితం ఏడాదిలోపే ముగిసిపోయింది. దాంపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే ఉన్నట్లుండి భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకోవడంతో ఆమె పని ఇక ముగిసిపోయినట్లేనని అందరూ భావించారు. కానీ ఆమె ఎంత త్వరగా కోలుకుందంటే అతికొద్దికాలంలోనే ఆరేడు సినిమాలకు సైన్ చేసింది. దక్షిణాదిన ఎవరికీ లేనన్ని చిత్రాలు ఆమె సొంతం. 
 
ధనుష్‌కు జంటగా నటించిన వేలై ఇల్లా పట్టాదారి–2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం అమలాపాల్‌ విష్ణువిశాల్‌కు జంటగా మిని మిని, అరవిందస్వామితో భాస్కర్‌ ఒరు రాస్కెల్‌ చిత్రాల్లో నటిస్తోంది. ఈ బోల్డ్‌ అండ్‌ బ్యూటీ నటి ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటుంది. ఈ మధ్య గాయనీ సుచిత్ర విడుదల చేసే తన రాసలీలల వీడియో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొని హాట్‌ టాపిక్‌గా మారింది. 
 
తాజాగా ఇచ్చిన ఒక భేటీలో మళ్లీ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు తానేమైనా సన్యాసిగా మారి హిమాలయాలకు వెళ్లతానని చెప్పానా కచ్చితంగా మళ్లీ పెళ్లి చేసుకుంటా.అదీ ప్రేమ వివాహమే అవుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు ముందే తెలియజేస్తాను అంటూ రుసరుస లాడింది. ఇప్పుడీ అంశం గురిం చే అమలాపాల్‌ సోషల్‌ మీడియాలో హాట్‌హాట్‌గా మారింది. 
 
చిన్న జీవితంలోనే దెబ్బతిన్నప్పటికీ కోలుకుని మళ్లీ కెరీర్‌ బాటలో విజవంతంగా కొనసాగుతున్న అమలా పాల్‌కు అంతా మంచే జరగాలని ఆశిద్దాం.