ఇట్స్ ఏ రిటర్న్ గిఫ్ట్ అంటూ ఆలరిస్తున్న "అఅఆ" ట్రైలర్
మాస్ మహారాజా రవితేజే హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అమర్ అమర్ అక్బర్ ఆంటోనీ. ఈ చిత్రం ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ఈనెల 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానుంది. గతంలో రవితేజ - శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వచ్చిన "నీకోసం, వెంకీ, దుబాయ్ శీను" వంటి చిత్రాలు మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. దీంతో ఇపుడు అఅఆ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఈ సినిమా విడుదలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉండటంతో మేకర్స్ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో రవితేజ.. అమర్, అక్బర్, ఆంటోని అనే మూడు పాత్రలలో కనిపించి ఆలరిస్తున్నాడు.
ముఖ్యంగా, సునీల్, వెన్నెల కిషోర్, రవితేజల కామెడీ నవ్వులు పూయిస్తోంది. ఈ మూవీ కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అర్థమవుతుంది. ఇకపోతే, ఈ చిత్రంలో గోవా బ్యూటీ ఇలియానా ఆరేళ్ల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.