ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: గురువారం, 30 మార్చి 2017 (14:40 IST)

నా మాట విను రజినీ... రాజకీయాల్లోకి వద్దు... అమితాబ్ హితబోధ

ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని అటు సామాజిక మాధ్యమాల్లో, ఇటు ప్రసార మాధ్యమాల్లో వస్తున్న విషయం తెలిసిందే. అభిమానుల ఒత్తిడితో రజినీ రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 2వ తేదీన జరిగే

ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని అటు సామాజిక మాధ్యమాల్లో, ఇటు ప్రసార మాధ్యమాల్లో వస్తున్న విషయం తెలిసిందే. అభిమానుల ఒత్తిడితో రజినీ రాజకీయాల్లోకి రావాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 2వ తేదీన జరిగే అభిమాన సంఘం సమావేశంలో రజినీకాంత్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న ఆసక్తితో అభిమానులు ఉన్నారు. ఖచ్చితంగా రజినీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు మొండి పట్టు పట్టుకుని కూర్చున్నారు. 
 
కానీ రజినీ రాజకీయాల్లోకి రావడం ఒకరికి మాత్రం ఇష్టంలేదు. ఆయనే బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్. రజినీ, అమితాబచ్చన్‌లు ఇద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరు ఎన్నో చిత్రాల్లో కలిసి కూడా నటించారు. 1980వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరపున అమితాబచ్చన్ అహ్మదాబాద్ ఎంపిగా పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తరువాత రాజకీయాల్లోనే ఎక్కువ సమయం కేటాయిస్తుండటంతో సినిమాలకు దూరమవుతూ వచ్చారు. కానీ అమితాబచ్చన్‌కు సినిమాలంటే ఎక్కువ ఇష్టం. ఇదే విషయాన్ని స్పష్టంగా ఫోన్లో రజినీకాంత్‌కు అమితాబ్ చెప్పినట్లు తెలుస్తోంది.
 
సినీ పరిశ్రమకు, రాజకీయాలకు ఎంతో వ్యత్యాసముందని దయచేసి రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ఆలోచనను మానుకోవాలని అమితాబ్ ప్రాధేయపడినట్లు తెలుస్తోంది. రజినీకాంత్ మాత్రం అన్నింటికీ తలూపుతూ ఏఫ్రిల్ 2న అత్యవసర అభిమానుల సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో రజినీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నది మాత్రం ఆసక్తిగా మారింది. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తానన్న ప్రకటన చేస్తే మాత్రం తన స్నేహితుడు అమితాబచ్చన్‌ను రజినీకాంత్ ఖాతరు చేయలదన్నమాట అనుకోవాల్సి వస్తుంది. చూద్దాం.... ఏం జరుగుతుందో?