శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (17:16 IST)

బిగ్ బి పెళ్లి పెద్దగా కత్రినా కైఫ్ వివాహం... హాజరైన దిగ్గజ స్టార్లు (video)

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పెళ్లి పెద్దగా బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ వివాహం ఇటీవల జరిగింది. ఈ వివాహ వేడుకకు సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలతో పాటు.. బిగ్ బి సతీమణి జయా బచ్చన్ కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుక ఎంతో కన్నులపండుగగా జరిగింది. 
 
ఆగండి.. ఆగండి సుమా.. నిజంగానే కత్రినాకు పెళ్ళైందని భావిస్తున్నారా? అంత లేదండోయ్... ఉత్తుత్తి వివాహమే. ఓ నగల దుకాణం ఆభరణాల ప్రమోషన్ కోసం ఈ పెళ్లిని అచ్చం నిజం పెళ్లిలాగే నిర్వహించారు. ఈ ఉత్తుత్తి పెళ్లికి సంబంధించిన ఫోటోలను అమితాబ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
కాగా, ఆ యాడ్‌లో కత్రిన పెళ్లి కూతురిగా, అమితాబ్, జయా బచ్చన్ ఆమె తల్లిదండ్రులుగా, నాగార్జున, ప్రభు, శివరాజ్‌కుమార్ ఆ పెళ్లికి వచ్చిన అతిథులుగా నటించారు. ఆ యాడ్‌కు సంబంధించిన ఫొటోను అమితాబ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
'జయకు, నాకు ఇది మర్చిపోలేని సందర్భం. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు లెజెండరీ నటుల సూపర్‌స్టార్ కుమారులతో నటించడం చాలా సంతోషాన్నిచ్చింది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున, తమిళ పరిశ్రమకు చెందిన శివాజీ గణేషన్ కుమారుడు ప్రభు, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్ కుమార్‌లతో కలిసి నటించామ'ని అమితాబ్ పేర్కొన్నారు.