ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2024 (18:50 IST)

ఆస్పత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్... ఆంజియోప్లాస్టీ చేశారా?

amitabh
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ ఆస్పత్రిలో చేరారు. అమితాబ్ బచ్చన్ అనారోగ్యానికి గురికావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు అమితాబ్‌కి ఆంజియోప్లాస్టీ చేసినట్టు తెలుస్తోంది. 
 
సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే ఆంజియోప్లాస్టీ జరిగిందని.. ప్రస్తుతం అమితాబ్‌ కోలుకుంటున్నారని ఆస్పత్రి వర్గాల సమాచారం. ఈ ఏడాదిలో ఇలా బిగ్ బి ఆస్పత్రిలో చేరడం ఇది రెండోసారి. 
 
కానీ బిగ్ బీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వున్నారు. తాజాగా ఆయన "ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా" అని రాసుకొచ్చారు. దీంతో అమితాబ్ ఆరోగ్యానికి సమస్యేమీ లేదని చెప్పేందుకే ఈ పోస్టు పెట్టివుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.