శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 16 మార్చి 2019 (18:03 IST)

అట్టహాసంగా ''లాస్య'' సీమంతం.. వీడియో చూడండి..

యాంకర్ లాస్య సీమంతం వేడుకగా అట్టహాసంగా జరిగింది. ప్రస్తుతం లాస్య సీమంతానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బుల్లితెర యాంకర్ అయిన లాస్య సమ్‌థింగ్ స్పెషల్ అనే షో ద్వారా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. యాంకర్ రవితో కలిసి ఈ షో చేసిన లాస్య.. తన చిన్ననాటి స్నేహితుడు మంజునాథ్‌ను పెళ్లాడింది. 2017 ఫిబ్రవరి 15వ తేదీన వీరి వివాహం జరిగింది. 
 
తాజాగా లాస్య త్వరలో అమ్మ కానుంది. ఇందులో భాగంగా లాస్యకు సీమంతం వేడుకను జరిపించారు.. ఆమె కుటుంబ సభ్యులు. దీనికి సంబంధించిన వీడియోలో లాస్య పచ్చరంగు చీరతో పుత్తడి బొమ్మలా కనిపిస్తోంది. కాగా లాస్య బుల్లితెర యాంకర్‌గానే కాకుండా.. రాజా మీరు కేక, మంచి లక్షణాలున్న అబ్బాయి అనే సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.