నా పోస్ట్‌కే ఎసరుపెట్టేట్టున్నారే...? స్టేజిపై యాంకర్ ఉదయభాను...
ఈమధ్య కాలంలో యాంకర్ అనసూయ, యాంకర్ శ్రీముఖి, యాంకర్ రేష్మిలు ఓ రేంజిలో దూసుకుపోతున్నారు. ఇక సీనియర్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే గత కొంతకాలంగా యాంకరింగుకు దూరంగా వున్న యాంకర్ ఉదయభాను తాజాగా నక్షత్రం ఆడియో వేడుకతో రీఎంట్రీ ఇచ్చింద
ఈమధ్య కాలంలో యాంకర్ అనసూయ, యాంకర్ శ్రీముఖి, యాంకర్ రేష్మిలు ఓ రేంజిలో దూసుకుపోతున్నారు. ఇక సీనియర్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐతే గత కొంతకాలంగా యాంకరింగుకు దూరంగా వున్న యాంకర్ ఉదయభాను తాజాగా నక్షత్రం ఆడియో వేడుకతో రీఎంట్రీ ఇచ్చింది. ఉదయభాను పలు చిత్రాల్లో నటించడమే కాదు ఐటం గాళ్‌గా కూడా నాట్యం చేసింది.
ఇక మాట్లాడటం బిగిన్ చేస్తే మామూలుగా వుండదు. అదే నక్షత్రం ఆడియో వేడుకలోనూ జరిగింది. స్టేజిపైన నక్షత్రం చిత్ర నిర్మాత మైకు పట్టుకుని ఎంతకీ వదలకుండూ ప్రసంగం చేస్తుండటంతో ఆడియెన్స్ అసహనానికి గురయ్యారు. దీనితో నిర్మాత నుంచి మైకును చాలా తెలివిగా తీసుకుంది యాంకర్ ఉదయభాను.
అలా తీసుకుంటూ... మీ వ్యవహారం చూస్తుంటే నా యాంకరింగ్ పోస్టుకే ఎసరుపెట్టేట్టున్నారే అంటూ నవ్వులు కురిపించింది. అటు నిర్మాతను హర్ట్ చేయకుండా ఇటు ఫంక్షన్ రసాభాస కాకుండా చక్కగా మేనేజ్ చేసేసింది.