శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 27 మే 2017 (17:57 IST)

ఇకపై ''సూపర్'' అనే పదమే వాడనన్న రవి- చలపతిరావును చంపేయండన్న రవిబాబు

'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో చలపతి రావు మహిళలను ఉద్దేశించి చేసిన నీచమైన కామెంట్స్ వల్ల ఆయనతో పాటు యాంకర్ రవిని కూడా ఇబ్బందులు తప్పలేదు. చలపతి రావు కామెంట్స్‌ను యాంకర్ రవి సూపర్ అంటూ ప్రోత్సహ

'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో చలపతి రావు మహిళలను ఉద్దేశించి చేసిన నీచమైన కామెంట్స్ వల్ల ఆయనతో పాటు యాంకర్ రవిని కూడా ఇబ్బందులు తప్పలేదు. చలపతి రావు కామెంట్స్‌ను యాంకర్ రవి సూపర్ అంటూ ప్రోత్సహించడంపై మహిళా సంఘాలు రవిపై కేసులు నమోదు చేశాయి. 
 
కానీ యాంకర్ రవి మాత్రం తాను చలపతి రావును ప్రోత్సహించలేదని, ఆ సమయంలో ఆడియో సమస్య ఉండటంతో ఆయన ఏమన్నారో కూడా తనకు వినిపించలేదని వాదించాడు. సౌండ్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో చలపతిరావు అన్న మాటలు తనకు వినిపించలేదని, ఆడియన్స్ అందరూ నవ్వుతుంటే, దాన్ని బట్టి ఆయనేదో పంచ్ వేసారనుకుని.. ‘సూపర్, సార్’ అని అన్నానని రవి కథ చెప్పిన సంగతి తెలిసిందే.
 
తాజాగా యాంకర్ రవి ఓ ట్వీట్ చేశాడు. ‘నాకు మద్దతుగా నిలిచిన, ధైర్యం చెప్పిన వారికి ధన్యవాదాలు. ఇకపై ఎక్కడా కూడా ‘సూపర్’ అనే పదం ఉపయోగించను’ అని ఆ ట్వీట్‌లో తెలిపాడు. ఇదిలా ఉంటే.. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో యాభై ఏళ్ల నట జీవితంలో ఎంతో గౌరవంగా బ్రతికిన తనను.. చరిత్ర హీనుడిగా మార్చారంటూ బహిరంగ లేఖలో చలపతిరావు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై చలపతి రావు కొడుకు, దర్శకుడు, నటుడు రవి బాబు కూడా స్పందించారు. 
 
గతంలో మహిళలపై ఎందరో నీచాతినీచంగా మాట్లాడినా పట్టించుకోలేదని.. అయితే మా నాన్నపై ఈ విధమైన కామెంట్స్ చేసి ఈ వయసులో ఆయన్ను మానసికంగా చంపడం కంటే, ఆయనపై శారీరకంగా దాడి చేసి చంపేయండంటూ.. రవిబాబు అన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. నోరు జారానని క్షమాపణలు చెప్పినా.. తండ్రికి నిరసనగా కామెంట్లు వెల్లువెత్తడం బాధేస్తుందని రవిబాబు అన్నారు. భార్య ఎప్పుడో చనిపోయినా.. కన్నబిడ్డల కోసం.. రెండో పెళ్లి చేసుకోకుండా తమ బాగోగులు చూసుకుంటున్న తండ్రిపై ఇలాంటి కామెంట్స్ రావడం బాధాకరమన్నారు.