శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శనివారం, 11 జూన్ 2016 (20:49 IST)

'ఏంజిల్' సాంగ్ రికార్డింగ్ : బాలీవుడ్ సింగర్ నకాష్ అజీజ్ సందడి

శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు, దర్శకుడు బాహుబలి పళని తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ, యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ 'ఏంజిల్' యంగ్ టాలెంటెడ్ హీరో నాగ అన్వేష్, హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో ఆధ్వర్యంలో ముంబైలో పాటల రికార్డింగ్ ప్రారంభమైంది. 
 
ప్రముఖ గాయకులు విజయ ప్రకాష్, శ్రేయా గోషాల్ పాడిన రెండు పాటల్ని రికార్డింగ్ ముగించి మరో పాటను హైదారాబాద్‌లో రికార్డింగ్ చేశారు. ఈ పాటను పాడేందుకు నకాష్ అజీజ్, 'సరైనోడు' బ్లాక్ బస్టర్ సాంగ్ ఫేమ్ ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా నకాష్ మీడియాతో ముచ్చటించారు. భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ డైరెక్షన్‌తో తాను మూడోసారి పాట పడుతున్నట్లు చెప్పారు. 'గబ్బర్ సింగ్'లో తోబా తోబా, 'సరైనోడు'లో బ్లాక్ బస్టర్ పాటల మాదిరిగా ఈ సాంగ్ కూడా మాస్ ఆడియన్స్‌కు ఆకట్టుకునేలా పాడారు.