శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 5 ఆగస్టు 2020 (17:40 IST)

అనిల్ రావిపూడి సరికొత్త ప్లాన్ ఇదే

పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై... తొలి సినిమాతోనే కమర్షియల్ సక్సస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆతర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలతో వరుసగా సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. దీంతో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకుని టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించి సరికొత్త రికార్డులు సాధించాడు.
 
ఈ సినిమా తర్వాత ఎఫ్ 2 సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కించాలి అనుకున్నాడు. కథ రెడీ. అయితే... కరోనా కారణంగా ఎఫ్ 3 సెట్స్ పైకి వెళ్లలేదు. ఇందులో నటించాల్సిన వెంకీ, వరుణ్ తేజ్ ఎప్పుడు డేట్స్ ఇస్తారో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. అందుచేత అనిల్ రావిపూడి ఇప్పుడు ఓ చిన్న సినిమా చేయాలనుకుంటున్నాడట. మీడియం రేంజ్ హీరోల్లో ఎవరు ఓకే అంటే వాళ్లతో సినిమా చేయాలనుకుంటున్నాడట. ఇది మంచి నిర్ణయమే.
 
ఎందుచేతనంటే.. కొంతమంది దర్శకులు స్టార్ హీరోల కోసం సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారు. అయితే.. ఇ.వి.వి సత్యనారాయణ మాత్రం పెద్ద సినిమాలే చేయాలని కూర్చోకుండా... చిన్న సినిమాలు కూడా చేసేవారు. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా అలా ఆలోచించడం మంచి నిర్ణయం. అనిల్‌తో సినిమా అంటే... లక్కీ ఛాన్సే. మరి... ఆ లక్కీ ఛాన్స్ ఏ హీరోకి దక్కుతుందో చూడాలి.