గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 30 నవంబరు 2020 (18:29 IST)

హోంబలే ఫిలింస్ బ్యానర్ నుండి మూడో ప్యాన్ ఇండియా మూవీ

భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో క్వాలిటీ చిత్రాల‌ను నిర్మించి ద‌క్షిణాది సినీ పరిశ్ర‌మ‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాల‌నే ఉన్న‌తాశ‌యంతో హోంబ‌లే ఫిలింస్ అనే నిర్మాణ సంస్థ‌ను స్టార్ట్ చేశారు విజ‌య్ కిర‌గందూర్‌. క‌న్న‌డ సూప‌ర్‌స్టార్స్ పునీత్ రాజ్‌కుమార్‌తో ‘నినింద‌లే’, య‌ష్‌తో ‘మాస్ట‌ర్ పీస్‌’ వంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌నురూపొందించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. త‌ర్వాత పునీత్ రాజ్‌కుమార్ చేసిన ‘రాజ‌కుమార‌’ చిత్రం హ‌య్య‌స్ట్ గ్రాసర్‌గా నిలిచి శాండిల్‌వుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థ‌గా హోంబ‌లే ఫిలింస్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 
 
రాకింగ్‌స్టార్ య‌ష్‌తో చేసిన భారీ బడ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్ ప్యాన్‌ ఇండియా మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్‌1’తో బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసి ప్యాన్ ఇండియా నిర్మాణ సంస్థ‌గా హోంబ‌లే ఫిలింస్ త‌న మార్క్‌ను క్రియేట్ చేసింది. ఇప్ప‌డు హోంబ‌లే ఫిలింస్ నిర్మాణంలో రూపొందుతోన్న మ‌రో ప్యాన్ ఇండియా భారీ బ‌డ్జెట్ మూవీ ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ సినిమా విడుద‌ల గురించి ప్రేక్ష‌కాభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. తాజాగా హోంబ‌లే ఫిలింస్ మ‌రో ప్యాన్ ఇండియా మూవీని నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా, హోంబ‌లే ఫిలింస్ అధినేత విజ‌య్ కిరగందూర్ మాట్లాడుతూ ‘‘మా బ్యాన‌ర్‌లో ప్యాన్ ఇండియా చిత్రంగా విడుద‌లైన ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 1’ ఎంత‌టి విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్పుడు మ‌రో ప్యాన్ ఇండియా చిత్రం ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’పై ఎలాంటి అంచ‌నాలున్నాయో తెలుసు. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా సినిమాను ధీటుగా రూపొందిస్తున్నాం. 
 
అలాగే ఇప్పుడు మా బ్యాన‌ర్‌లో మూడో ప్యాన్ ఇండియా సినిమాను రూపొందించనున్నాం. భార‌తీయ భాష‌ల‌న్నింటిలో రూపొంద‌నున్న ఈ సినిమా టైటిల్‌, అందులోని న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను డిసెంబ‌ర్ 2, 2020 మ‌ధ్యాహ్నం 2 గంట‌ల 9 నిమిషాల‌కు తెలియ‌జేస్తాం’’ అన్నారు.