శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 మే 2017 (16:36 IST)

అనుష్కకు పెళ్లి ఖరారు..? పెళ్లికొడుకు ఎవరబ్బా..?

ప్రముఖ దర్శకుడు జక్కన్న చెక్కిన అద్భుత విజువల్ వండర్స్ బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల్లో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు లభించింది. కలెక్షన్లు, రికార్డుల పేరిట బాహుబలి దుమ్ముదులిపేస్తుంటే.. దేవసేనగా నట

ప్రముఖ దర్శకుడు జక్కన్న చెక్కిన అద్భుత విజువల్ వండర్స్ బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల్లో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు లభించింది. కలెక్షన్లు, రికార్డుల పేరిట బాహుబలి దుమ్ముదులిపేస్తుంటే.. దేవసేనగా నటించిన అనుష్కకు సినిమా ద్వారా మంచి క్రేజ్ లభించింది. బాహుబలి-2 మొత్తం దేవసేన చుట్టే తిరగడం ఆమెకు ప్లస్ అయ్యింది. ఈ నేపథ్యంలో దేవసేన ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని డిసైడైనట్లు తెలుస్తోంది.
 
బాహుబలిలో అనుష్కతో జతకట్టిన ప్రభాస్‌కు సైతం 6వేల పెళ్లి ప్రతిపాదనలు రాగా.. ప్రస్తుతం అనుష్క వంతు వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో అనుష్కకు ప్రత్యేక క్రేజ్ వుంది. ప్రస్తుతం బాహుబలి2 బంపర్ విక్టరీ కొట్టిన అనుష్క భాగమతి సినిమాతో పాటు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ చిత్రాలను త్వరలో పూర్తి చేయాలని దర్శక నిర్మాతలకు షరతు కూడా పెట్టేసింది. 
 
ఈ సినిమాలు పూర్తయ్యాక అనుష్క పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో అనుష్క వివాహం జరుగనుందని టాక్. పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే కోలీవుడ్‌లో అనుష్క తన అసిస్టెంట్లను కూడా ఉద్యోగాల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. అన్నీ పనులు ముగిశాక అనుష్క ఈ ఏడాదిలోపు పెళ్లాడాలని డిసైడైపోయినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.