శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 19 జూన్ 2018 (11:27 IST)

ప్రభాస్ భుజాలపై అలా నడుచుకుంటూ వెళ్లడం తప్పు కాదా?: స్వీటీ ఏమంది?

దేవసేనగా ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క.. ''బాహుబలి'' సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కడంతోపాటు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. అయితే ఈ సినిమాకు గానూ బిహైండ్‌వుడ్స్‌‌ గోల్డ్‌ మెడల్ ఉత్తమ నటి అవార్డ

దేవసేనగా ప్రేక్షకులను ఆకట్టుకున్న అనుష్క.. ''బాహుబలి'' సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కడంతోపాటు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. అయితే ఈ సినిమాకు గానూ బిహైండ్‌వుడ్స్‌‌ గోల్డ్‌ మెడల్ ఉత్తమ నటి అవార్డును అనుష్క అందుకున్నారు.


ఇదే సినిమాకు గానూ ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా రమా రాజమౌళి, ప్రశాంతి అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ సహాయ నటిగా రమ్యకృష్ణ, ఉత్తమ దర్శకుడిగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి అవార్డులు కైవసం చేసుకున్నారు. 
 
ఇక అవార్డు అందుకున్న సందర్భంగా అనుష్కకు ఓ ప్రశ్న ఎదురైంది. ''బాహుబలి'' సినిమాలో ప్రభాస్‌ భుజాలపై నడుచుకుంటూ వెళ్లడం సరైనదేనా? అనే ప్రశ్నకు స్వీటీ ఇలా సమాధానం ఇచ్చారు.

మరొకరి భుజాలపై నడవటం తప్పే. కానీ ''బాహుబలి'' సినిమాలో అలాంటి పాత్ర పోషించడం దేవసేన తప్పు కాదంటూ సమాధానం చెప్పారు. కాగా బాహుబలి తర్వాత భాగమతిలో నటించిన అనుష్క.. ఆపై సినిమాలకు కాస్త దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే.