శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (13:50 IST)

అనుష్క శెట్టి 'ఆకు మెట్టె' వెనుక అసలు కథేంటంటే...

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. తాను తాజాగా షేర్ చేసిన ఆకు మెట్టె ఫోటో వెనుక వేరే కథ ఉందని చెప్పుకొచ్చింది. 
 
నిజానికి అనుష్క రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. అది బాగా వైరల్ అయింది. దీనికి కారణం ఆమె ఆకు మెట్టెకు సంబంధించినది కావడమే. ఇంకేముంది అనుష్కకు సినిమాల్లేక పోవడంతో పెళ్లికి సిద్ధమైపోయిందంటూ నెట్టింట్లో రచ్చరచ్చ అయింది. దీంతో మళ్లీ అనుష్క క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అయితే తాను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన పిక్‌కూ, పెళ్లికి సంబంధం లేదని తెలిపింది. 
 
అసలు విషయం ఏంటంటే.. ఈ బొద్దుగుమ్మ బరువు తగ్గేందుకు నార్వేలోని ఓ ప్రకృతి వైద్యశాలలో అడ్మిట్ అయింది. ఈ వైద్యశాలలో నాచురోపతి ట్రీట్‌మెంట్ ద్వారా బరువు తగ్గిస్తారు. దట్టమైన అడవుల్లో ఉండే ఈ వైద్యశాలలో ఖాళీ సమయాల్లో సరదాగా తిరుగుతూ ఉండగా తన కాలికి తగిలిన తీగను ఫోటో తీసి పోస్ట్ చేసిందట. దీన్ని చూసిన నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.