ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (15:21 IST)

అనుష్క పెళ్లైంది.. ఇష్టమైన వరుడితో జేజెమ్మ పెళ్లి జరిగిపోయింది..

అనుష్కకు పెళ్ళైంది. జేజమ్మ అనుష్క ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కింది. తను కోరుకున్న వరుడిని పెళ్లి చేసుకుంది. కానీ ఇదంతా రియల్ లైఫ్‌లో కాదు. రీల్‌ లైఫ్‌లో. సూర్య, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన 'సింగం-3

అనుష్కకు పెళ్ళైంది. జేజమ్మ అనుష్క ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కింది. తను కోరుకున్న వరుడిని పెళ్లి చేసుకుంది. కానీ ఇదంతా రియల్ లైఫ్‌లో కాదు. రీల్‌ లైఫ్‌లో. సూర్య, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన 'సింగం-3' జనవరి 26న విడుదల కానుంది. తొలి రెండు సినిమాల్లోనూ సూర్యకు అనుష్క ప్రియురాలిగా నటించింది. పెళ్లి పీటలు ఎక్కడమే తరువాయి అనుకున్న ప్రతీ సందర్భంలోనూ వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. 
 
దాంతో తొలి రెండు భాగాల్లోనూ సూర్య, అనుష్క లవర్స్‌గానే కనబడతారు. కానీ, ఈ మూడో భాగంలో మాత్రం సూర్యకు భార్యగా కనిపిస్తుందట స్వీటీ. ఈ సినిమాలో మరో హీరోయిన్‌ శృతిహాసన్‌. ఇందులో శృతీది గ్లామరస్‌ పాత్రే అయినప్పటకీ ఆమెకు యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉంటాయట. కానీ ఈ చిత్రంలో ఇద్దరు భామలూ పోటీపడి మరీ గ్లామర్ విందు చేశారట.
 
సూర్య ఫ్యామిలీ బ్యానర్ స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన హరి దర్శకుడు. ఇదే సీరీస్లో రిలీజ్ అయిన గత చిత్రాలతో పోలిస్తే భారీ బడ్జెట్తో మరింత స్టైలిష్గా సింగం 3ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోగా సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.