సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: గురువారం, 31 డిశెంబరు 2020 (22:45 IST)

అభిజిత్‌కు సినీ ఆఫర్లు వస్తున్నాయా?

అన్ని సీజన్లలోను బిగ్ బాస్ 4 సీజన్‌కు ఒక ప్రత్యేక ఉంది. అన్నీ తానై నడిపించారు నాగార్జున. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ షోలో నటించిన వారికి పలు ఆఫర్లు వాళ్ళ తలుపులు తట్టాయి. ఇప్పటికే సోహెల్‌కు సినిమా అవకాశం రాగా తన తదుపరి చిత్రంలో దివి ఒక రోల్ చేస్తున్నట్లు స్వయంగా చిరంజీవి ప్రకటించారు.
 
అయితే అభిజిత్, అఖిల్‌కు మాత్రం అవకాశాలు రాకపోవడంతో వారి అభిమానులను బాగా నిరాశకు గురిచేస్తోంది. ఇక ఇప్పుడు అభిజిత్‌కు ఒక సినిమా ఆఫర్ వచ్చిందట. ఎఫ్-3 సినిమాలో ఒక కీలకపాత్ర కోసం సంప్రదింపులు జరిపారట. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
 
గతంలో కూడా ఇలాగే అభిజిత్‌కు ఆఫర్లు వచ్చాయని ప్రచారం జరిగింది. కానీ అభిజిత్‌కు మాత్రం ఆఫర్లు రాలేదట. వచ్చిన ఒకే ఒక్క సినిమాలో ఆ క్యారెక్టర్ కాస్త తనకు నచ్చలేదన్న భావనలో ఉన్నారట అభిజిత్. దీంతో ఆ అవకాశమూ పోతే ఇక అభిజిత్‌కు అవకాశం రావడం కష్టమంటున్నారు సినీవిశ్లేషకులు.