శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2017 (10:48 IST)

ప్రకాష్ రాజ్ ఇంటిపై ముట్టడి.. సావిత్రిలో ఛాన్స్ మిస్.. దుల్కర్‌కు అవకాశం..

ప్రముఖ సినీనటుడు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నివాసాన్ని తమిళర్ మున్నేట్ర పడై పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళ రాష్ట్రాన్ని తమిళులే పాలించాలన్న నినాదానికి వ్యతిరేకం

ప్రముఖ సినీనటుడు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నివాసాన్ని తమిళర్ మున్నేట్ర పడై పార్టీ కార్యకర్తలు ముట్టడించారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళ రాష్ట్రాన్ని తమిళులే పాలించాలన్న నినాదానికి వ్యతిరేకంగా ప్రకాష్ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేయడమే ఇందుకు కారణం. ఈ కామెంట్స్‌పై ప్రకాష్‌రాజ్‌ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పలు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 
 
అయితే, ప్రకాష్‌రాజ్‌ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో స్థానిక అడయార్‌లోని ఆయన నివాసాన్ని ఆ సంస్థకు చెందిన 50 మంది కార్యకర్తలు ముట్టడించారు. ఈ ఆందోళన ఆ పార్టీ వ్యవస్థాపకురాలు వీరలక్ష్మి సారథ్యంలో జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
 
ఇదిలా ఉంటే.. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో క్లారిటీ ఇచ్చింది యూనిట్. ఇందులో కీలకమైన జెమినీ గణేశన్ పాత్రకు దుల్కర్ సల్మాన్‌‍ను ఎంపిక చేసినట్టు ప్రకటించింది.
 
నిజానికి ఈ క్యారెక్టర్ కోసం మొదట ప్రకాష్ రాజ్‌ను అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో దుల్కర్ సల్మాన్ పేరును ప్రకటించారు. మూవీలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించనుంది. ఈమెకు భర్తగా దుల్కర్ నటించబోతున్నారు. మరో కీలకమైన జర్నలిస్ట్ పాత్ర కోసం సమంతను తీసుకున్నారు.