గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2016 (16:10 IST)

అవికా గోర్‌‍కు వాట్సాప్ ద్వారా అశ్లీల మెసేజ్‌లు.. ఆ యువ హీరో ఎవరు?

ఉత్తరాది నుంచి దక్షిణాదికి బుల్లితెరపై కనిపించి.. ఆపై వెండితెరపై మెరుస్తున్న అవికాగోర్‌‍ను ఓ టాలీవుడ్ కుర్ర హీరో వేధిస్తున్నాడట. ఇదే ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఓ యువ హీరో అవికా పట్ల

ఉత్తరాది నుంచి దక్షిణాదికి బుల్లితెరపై కనిపించి.. ఆపై వెండితెరపై మెరుస్తున్న అవికాగోర్‌‍ను ఓ టాలీవుడ్ కుర్ర హీరో వేధిస్తున్నాడట. ఇదే ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఓ యువ హీరో అవికా పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నాడనే న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

చిన్నారి పెళ్లి కూతురు సిరీయల్‌లో నటించిన అవికా గోర్, ఆ తర్వాత ''ఉయ్యాల జంపాల'' మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అవికా గోర్ మీద కన్నేసి ఇండస్ట్రికీ చెందిన ఓ యువ హీరో ఆమె వేధిస్తున్నాడనే ప్రచారం మొదలైంది.
 
అవికా గోర్‌ను వాట్సాప్‌ ద్వారా అసభ్య, అశ్లీల మెసేజ్ లు పంపుతున్నాడని.. గుర్తు తెలియని నెంబర్ నుంచి తొలుత మెసేజ్‌లు రావడంతో మొదట గుర్తు పట్టలేకపోయిన హీరోయిన్.. ఆ పై ఓ యువ హీరోనే ఈ పని చేస్తున్నాడని కనిపెట్టిందట.

నిఖిల్, రాజ్‌తరుణ్, సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీలో తనకు సన్నిహితంగా ఉన్న హీరోలు.. రకుల్ ప్రీత్ సింగ్, హెబ్బా పటేల్ వంటి తన ఫ్రెండ్స్ అయిన హీరోయిన్లతో అవికా గోర్ ఈ మేసేజ్‌లు చూపించి బాధపడినట్లు సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కెరీర్‌తో పాటు పెద్ద ఇష్యూ అయిపోతుందని అవికా గోర్ బాధపడుతుందని తెలిసింది.