గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 మే 2017 (11:05 IST)

'బాహుబలి 2' కలెక్షన్ల మోత : రెండోవారంలోనూ కొత్త చిత్రాల రిలీజ్ లేనట్టే!

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "బాహుబలి 2 ది కంక్లూషన్". గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఈ చిత్రాన్నే ప్రదర్శిస్తున్నా

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "బాహుబలి 2 ది కంక్లూషన్". గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఈ చిత్రాన్నే ప్రదర్శిస్తున్నారు. అయినప్పటికీ అన్నిచోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్లే. పైగా, చిత్రం విడుదలై వారం రోజులు దాటిపోయి... రెండోవారంలోకి అడుగుపెట్టింది. అయినప్పటికీ... చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీంతో కొత్త చిత్రాలకు థియేటర్లు దొరకడం లేదు. 
 
'బాహుబలి 2' థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తుతుండటంతో మరో వారంపాటు ఈ ప్రభంజనం కొనసాగేలా ఉంది. దీంతో వచ్చే శుక్రవారం విడుదల చేయాలనుకున్న చిత్రాలకు థియేటర్లు లేక వాయిదా పడుతున్నాయి. మే 5వ తేదీన విడుదలకు ప్లాన్ చేసుకున్న నాలుగు సినిమాలను వాయిదా వేసుకోకతప్పని పరిస్థితి. పలు చిత్రాలు వాయిదా పడ్డాయి. తాజాగా మరికొన్ని చిత్రాలను వాయిదా పడనున్నాయి.