శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 16 మే 2017 (05:54 IST)

కేరళలో 50 కోట్ల క్లబ్‌లో ప్రవేశించిన బాహుబలి-2.. మాలివుడ్ ఆల్ టైమ్ కలెక్షన్ల చరిత్రలో రెండో స్థానం

కేరళ చలనచిత్ర చరిత్రలో అరుదైన రికార్డుకు చేరువవుతున్న బాహుబలి-2 చిత్రం రెండు వారాల్లో రూ. 50 కోట్లు సాదించి సంచలనం సృష్టించింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి-2 ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్ల రూపాయలు సాధించిన

కేరళ చలనచిత్ర చరిత్రలో అరుదైన రికార్డుకు చేరువవుతున్న బాహుబలి-2 చిత్రం రెండు వారాల్లో రూ. 50 కోట్లు సాదించి సంచలనం సృష్టించింది. ప్రభాస్ ప్రధాన పాత్రలో, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి-2 ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్ల రూపాయలు సాధించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. అతి చిన్న రాష్ట్రమైన కేరళ చిత్రపరిశ్రమ మాలివుడ్‌ అదిరిపోయే కలెక్షన్లతో రెండువారాల్లో 50 కోట్లు వసూలు చేసి దిగ్భ్రాంతి పరిచిన బాహుబలి-2 ఇప్పుడు మరో అరుదైన రికార్డు దిశగా పరుగులు తీస్తోంది. ప్రేక్షకుల తీరు చూస్తే మోహన్‌లాల్ తాజా చిత్రం పులిమురుగన్ సాధించిన లైఫ్ టైమ్ కలెక్షన్ అయిన 80కోట్ల రూపాయల వసూలు రికార్డును కూడా బాహుబలి-2 సాధిస్తుందని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
 
కేవలం రెండు వారాల వ్యవధిలో 52 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇంకా భారీ కలెక్షన్ల వైపు దూసుకుపోతున్న బాహుబలి-2 చిత్రం మలయాళేతర సినిమాల కలెక్షన్ల రికార్డును బద్దలు చేసింది. కేరళలో ఏప్రిల్ 28న 300 థియేటర్లలో విడుదలైన బాహుబలి-2 రెండు వారాల తర్వాత కూడా 300 థియేటర్లలో ఆడుతూనే ఉంది. రెండు వారాల తర్వాత కూడా ఏ ఒక్క థియేటర్ నుంచి కూడా సినిమాను ఎత్తివేయలేదంటే కేరళ సినీ చరిత్రలో అదొక అద్భుతమంటున్నారు. చివరకు కేరళ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు సాదించిన మోహన్ లాల్ పులిమురుగన్ చిత్రం కూడా 16 రోజుల్లో 52 కోట్లను సాధించగలిగింది. ఆవిధంగా మాలివుడ్ చిరిత్రలో 50 కోట్ల పైగా వసూలు చేసిన రెండో చిత్రంగా బాహుబలి2 చరిత్రకెక్కింది.
 
మలయాళీయేతర చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా బాహుబలి-2 చరిత్ర సృష్టించింది. తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన ఐ చిత్రం సైతం కేరళ బాక్స్ ఆఫీసులో 20 కోట్ల రూపాయలు మాత్రమే కలెస్ట్ చేసి నిలిచిపోయింది. ఒక మలయాళీయేతర చిత్రం కేరళ బాక్సాఫీసులో 14 రోజుల్లో 52 కోట్లు సాధించడం ఇదే మొదటిసారి. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ చిత్రం పులిమురుగన్ ఇంతవరకు అంటే ప్రపంచ వ్యాప్తంగా లైఫ్ టైమ్‌లో 86 కోట్లు సాధించి కలెక్షన్ల పరంగా నంబర్ వన్ స్థానంలో ఉంది. రెండువారాలకు ముందు మాత్రమే విడుదలై కేవలం 14 రోజుల్లో 52 కోట్లు వసూలు చేసిన బాహుబలి-2 చిత్రం మోహన్ లాల్ పులిమురుగన్ కలెక్షన్లను కూడా అధిగమించి కేరళ బాక్సాఫీస్ చరిత్రలో టాప్ సినిమాగా నిలుస్తుందని అంచనా.
 
ఇప్పటికే మాలివుడ్ అగ్రనటులు మోహన్ లాల్, ముమ్ముట్టి చిత్రాల రికార్డులన్నింటినీ బద్దలు గొట్టిన బాహుబలి-2 చిత్రం సంచలనాలకే సంచలనగా నిలుస్తోంది. వేసవి సెలవులు ఇంకా ముగియక పోవడంతో మరో 25 రోజుల వరకు బాహుబలి-2 కలెక్షన్లకు కేరళలో తిరుగు ఉండదని భావిస్తున్నారు. మోహన్ లాల్ నటించిన పులిమురుగన్ చిత్రం కూడా రెండు వారాల్లో దేశవ్యాప్తంగా 50 కోట్లు సాధించింది కానీ కేరళలో దాని కలెక్షన్లు తక్కువే. దీంతో 14 రోజుల్లో కేరళలో మాత్రమే 52 కోట్లు సాదించిన బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టే సినిమా మలయాళ సినీ పరిశ్రమలో బహుశా రాబోదని అంటున్నారు.
 
ఒక్కమాటలో మలయాళీ చిత్రపరిశ్రమను బాహుబలి-2 సునామీలా తాకింది.