ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 మార్చి 2017 (15:24 IST)

బాహుబలి-2: కట్టప్ప పోస్టర్-బాహుబలిని చిన్నారిగా చేతబట్టుకుని.. పెద్దయ్యాక వెన్నంటి పొడిచేశాడు..

సినీ ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. 'బాహుబలి: ద కన్‌క్లూజన్' సినిమా ట్రైలర్ విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ అయిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ సినిమా ట

సినీ ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. 'బాహుబలి: ద కన్‌క్లూజన్' సినిమా ట్రైలర్ విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ అయిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బాహుబలి: ద కన్‌క్లూజన్‌’ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను కనువిందు చేయనుంది. రాజ‌మౌళి ఎట్టకేల‌కు ఆ ట్రైల‌ర్ విడుద‌ల తేదీని చెప్పేశారు. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఈ నెల‌ 16న విడుదల చేయనున్నట్లు ఈ సినిమా బృందం తెలిపింది. 
 
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలోనూ 16వ తేదీ ఉదయం 9గం. నుంచి 10గంటలకు మధ్య విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అదే రోజు సాయంత్రం 5గంటలకు సోష‌ల్ మీడియాలో కూడా ఈ మూవీ ట్రైల‌ర్‌ విడుదల చేయనున్నారు. ఈ ట్రైలరే వంద రోజులు ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ స‌ర‌స‌న అనుష్క, తమన్నా న‌టించారు. రానా, ర‌మ్యకృష్ణ‌, నాజ‌ర్‌, స‌త్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.
 
ఇందులో సత్యరాజ్ కట్టప్పగా కనిపించారు. అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు బాహుబలి-2లోనే సమాధానం లభించనుంది. ఈ నేపథ్యంలో కట్టప్ప బాహుబలిని చేతిలో చిన్నారిగా పెట్టుకుని.. ఆపై వెనుకనుంచే అదే బాహుబలిని చంపే పోస్టర్‌ను యూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.