శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2017 (10:39 IST)

బాహుబలి ఫీవర్.. తెలుగు రాష్ట్రాల్లో రూ.120 కోట్లకు పైగా రైట్స్ సేల్..

బాహుబలి 2 ఫీవర్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా 8వేల స్క్రీన్లలో రిలీజ్ కానుంది. భారత్‌లో మాత్రం ఐదువేల స్క్రీన్లు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సంబంధించి మరో 3 వేల స్క్రీన్లను కలుపుకొని ఓవరాల్‌గా 8 వేల స్క్రీ

బాహుబలి 2 ఫీవర్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా 8వేల స్క్రీన్లలో రిలీజ్ కానుంది. భారత్‌లో మాత్రం ఐదువేల స్క్రీన్లు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సంబంధించి మరో 3 వేల స్క్రీన్లను కలుపుకొని ఓవరాల్‌గా 8 వేల స్క్రీన్లలో రాబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అమెరికాలో మరో 500 నుంచి 750 స్క్రీన్లు రావచ్చునని ఓ అంచనా. ఏప్రిల్‌ 28న భారీ ఎత్తున రానుంది ఈ ఫిల్మ్‌లో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 
 
మరో రెండు రోజుల్లో బాహుబలి-2 రిలీజ్ కాబోతోంది. బ్రహ్మాండమైన హైప్, విజువల్స్, ప్రమోషన్లతో ఇప్పటికే దీని ప్రచారం పీక్ దశకు చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అప్పుడే ఈ చిత్రానికి లక్ష అడ్మిషన్స్ వచ్చాయట. ఇక్కడ కోట్లపై పైగా వసూళ్లు ఖాయమని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 350 కోట్లకు, తెలుగు రాష్ట్రాల్లో రూ.120కి పైగా కోట్లకు దీని హక్కులు అమ్ముడు పోయాయి.