బాహుబలి 2 హిందీ శాటిలైట్ రైట్స్ అంత పలికిందా? వామ్మో రూ.51కోట్లతో సోనీకే ఆ ఛాన్స్!
బాహుబలి ది బిగినింగ్ ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 (ది కన్‌క్లూజన్)ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ
బాహుబలి ది బిగినింగ్ ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు తిరిగి చూసేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 (ది కన్‌క్లూజన్)ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నైజాం రైట్స్‌ను ఎసియన్ ఎంటర్ ప్రైజెస్ అధినేతలు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ లు 50 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ మూవీ హిందీ శాటిలైట్ రైట్స్‌ను సోనీ టీవీ రూ.51కోట్లకు దక్కించుకుంది. ఇంకా ఈ మొత్తానికి సర్వీస్ ట్యాక్స్ లు అదనం. బాహుబలి పార్ట్ 1(ద బిగినింగ్) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసులను కొల్లగొట్టడంతో పార్ట్ 2కు మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో బాహుబలి కోసం మార్కెట్ వర్గాలు క్యూకడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీగా పలకడం ట్రేడ్ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఇకపోతే.. ప్రభాస్, అనుష్క, రానా, నాజర్, సత్యరాజ్ తదితరులు నటించిన బాహుబలి 2 సినిమా ఓవర్సీస్ రైట్స్ తెలుగు, తమిళం, హిందీ కలిసి థియేటర్ రైట్స్ రూ.47కోట్లకు అమ్మినట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. రిలీజ్‌కు ముందే భారీగా పలికే బాహుబలి2.. విడుదలయ్యాక ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.