శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2017 (13:41 IST)

అదొక్కటే బాహుబలి2కి మైనస్.. దేవసేన వల్లే మొత్తం మారిపోయింది..

ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్కల, సత్యరాజ్‌ల నటన, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రాజమౌళి చెక్కిన బాహుబలి2 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ సూపర్ అంటూ టాక్ వచ్చేంది. స్

ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్కల, సత్యరాజ్‌ల నటన, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రాజమౌళి చెక్కిన బాహుబలి2 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్ సూపర్ అంటూ టాక్ వచ్చేంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ అన్నీ అదిరిపోయాయి. ఎవరి పాత్రల్లో వారు ఇమిడిపోయి తమ రోల్స్‌కి పూర్తి న్యాయం చేకూర్చారు.

అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ ఫస్ట్ పార్ట్‌లో కన్నా ఈ సెకండ్ పార్ట్‌లో పూర్తి రాజసంతో కనిపించాడు. రానా విలనిజం మొదటి భాగంలో మాదిరే ఇందులోనూ తనదైన స్టయిల్‌లో మెప్పించేశాడు. శివగామిగా రమ్యకృష్ణ అదిరిపోయే నటనతో ఆకట్టుకుంది. కానీ ఒక్కటి మాత్రమే బాహుబలి2కి మైనస్ అయ్యింది. 
 
తొలి అర్థభాగం బ్రహ్మాండంగా ఉండగా సెకండ్ హాఫ్ మాత్రం సుదీర్ఘంగా సాగతీతగా అనిపించింది. తప్పితే సెకండ్ హాఫ్ నిడివి కాస్త తగ్గించి ఉంటే సినిమా బాగుండేది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నది అర్థమైపోయింది. ఇన్నాళ్ళుగా అందర్నీ అదేపనిగా అయోమయంలో పెట్టిన ఈ ప్రశ్నకు సమాధానం లభించింది. దేవసేన వల్లే మొత్తం ప్లాట్ అంతా మారిపోయిందనే షాక్ న్యూస్ బయటికి వచ్చింది. శివగామి భల్లాల దేవుని మాటలు నమ్మి బాహుబలిని రాజుగా కాక సేనాధిపతిగా చేయడం వంటి సీన్స్ ఆకట్టుకుంటాయి. మొత్తానికి ఎవరూ ఊహించని ఘటనలు బాహుబలి 2లో కనిపించడం ఎంతో విశేషం.