శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 14 మే 2017 (11:31 IST)

రూ.1300 కోట్ల క్లబ్‌లో బాహుబలి-2.. కన్నడంలో అనువాదానికి ఛాన్స్ ఇచ్చివుంటే?

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటించి.. ఏప్రిల్ 28న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలి 2 రికార్డులను బద్దలు కొడుతూ.. సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే వెయ్

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటించి.. ఏప్రిల్ 28న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలి 2 రికార్డులను బద్దలు కొడుతూ.. సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇప్పటికే వెయ్యి కోట్లని సాధించిన మొట్ట మొదటి భారతీయ చిత్రంగా బాహుబలి 2 చరిత్ర సృష్టించగా.. తాజాగా ఆ రికార్డ్‌ని కూడా బద్దలు కొట్టి ప్రపంచ వ్యాప్తంగా 1300 కోట్లకు పైగా వసూళ్లని సాధించి ఎవరూ అందుకోలేని దిశగా దూసుకుపోతోంది. విడుదలైన 13 రోజుల్లోనే ఇంత మొత్తాన్ని బాహుబలి-2 వసూళ్లు చేసింది.
 
ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మించగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. దేశ వ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్లని వసూల్ చేసింది బాహుబలి 2. అలాగే ఓవర్ సీస్‌లో కూడా రూ.240 కోట్ల వసూళ్లని సాధించింది. మొత్తంగా తీసుకుంటే.. రూ. 1300 కోట్లకు పైగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 
 
ఇదిలా ఉంటే.. తమిళం తరహాలో కన్నడంలో కూడా బాహుబలి-2 చిత్ర అనువాదానికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆ చిత్ర దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి అన్నారు. ఆయన శనివారం బళ్లారి సిటీలోని రాధిక సినిమా థియేటర్‌లో బాహుబలి-2ను వీక్షించారు.  బాహుబలి-2 దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్‌ కావడం సంతోషంగా ఉందన్నారు. తనతో పాటు హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ శ్రమించడం ఈ విజయానికి దోహదపడిందన్నారు.