బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : మంగళవారం, 2 మే 2017 (18:06 IST)

'కన్నా నిదురించరా...' అంటూ 'బాహుబలి'ని నిద్రపుచ్చిన ఆ తీయని కంఠస్వరం ఈమెదే....

తీయని కంఠస్వరం దేవుడిచ్చిన వరం. "శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణిహి"... ఇదీ సంగీతం ప్రాముఖ్యత. శిశువులు, పశువులే కాదు పాములు సైతం సంగీతానికి పరవశించిపోతాయని పెద్దలు చెప్పారు. తీయని సంగీతంత

తీయని కంఠస్వరం దేవుడిచ్చిన వరం. "శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణిహి"... ఇదీ సంగీతం ప్రాముఖ్యత. శిశువులు, పశువులే కాదు పాములు సైతం సంగీతానికి పరవశించిపోతాయని పెద్దలు చెప్పారు. తీయని సంగీతంతో మనసు పరవశమవుతుంది. గత శుక్రవారం విడుదలయిన బాహుబలి 2 చిత్రంలో.. కన్నా నిదురించరా... అనే పాటకు రోజురోజుకీ శ్రోతలు పెరుగుతున్నారు. ఈ పాటను అత్యధికంగా తమిళులు ఇప్పటివరకూ 4,06,921 మంది విని పరవశించారు. ఇక హిందీలో 2,79,238 మంది ఆ పాట విని ఆనందించారు. తెలుగులో 73, 548 మంది విన్నారు. ఆ పాటను అంత మధురంగా ఆలపించిన గాయని ఆంధ్రప్రదేశ్ అనంతపూర్‌కు చెందిన తిరుమల శ్రీనిధి. 
 
ఈ సందర్భంగా ఈ గాయని గురించి తెలుసుకుందాం. తిరుమల శ్రీనిధి 1990లో పుట్టారు. కర్నాటక సంగీతంలో మంచి ప్రావీణ్యమున్న శ్రీనిధి తన సంగీత జైత్రయాత్రను 11 ఏళ్ల నుంచే మొదలుపెట్టారు. ఎన్నో కచేరీలు చేశారు. ఆమె తండ్రి ప్రముఖ విధ్వాంసులు, వయొలినిస్ట్ సుబ్రహ్మణ్యచారులు. తల్లి శారద కూడా కర్నాటక సంగీతంలో ప్రావీణ్యులు. వీరి సంగీత సముద్రంలో పుట్టి పెరిగిన శ్రీనిధి చిన్ననాటి నుంచే సంగీతం పట్ల ఎంతో మక్కువను ప్రదర్శించేవారు. ఆ క్రమంలో రెండురన్నరేళ్ల నంచే సంగీతంలోని రాగాలు... గుర్తు పట్టి ఆలపించేవారు. 
 
ఆమె అద్భుతమైన ప్రతిభను చూసి భవిష్యత్తులో గొప్ప గాయకురాలవుతారని అప్పుడే అనుకున్నారు. అనుకున్నట్లే ఆమె సంగీత ప్రక్రియల్లో ఎన్నో మైలు రాళ్లను దాటి ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు. ఆమె ఓ నమో వేంకటేశాయ, శివమ్, తెలుగమ్మాయ్ తదితర చిత్రాల్లో పాటలు పాడారు. తాజాగా బాహుబలి 2లో కన్నా నిదురించరా పాటను ఆలపించారు. ఇంకా ఆమె అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఆల్బమ్ చేశారు. ఈ మధుర గాయని మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరిన్ని తీయని పాటలు తన కోకిల కంఠస్వరం ద్వారా వినిపించాలని కోరుకుందాం.
 
మరొక్కసారి క్లిక్ చేసి వినండి తిరుమల శ్రీనిధి ఆలపించిన కన్నా నిదురించరా వీడియో సాంగ్...