శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2017 (10:16 IST)

దేవసేనను 'బాహుబలి' ఏం చేశాడంటే... టీవీ సీరియల్‌గా తీస్తా : ఎస్.ఎస్.రాజమౌళి ప్రకటన

ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం రెండో భాగంలో వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తొలి భాగం బాహుబలిలో కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చ

ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం రెండో భాగంలో వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తొలి భాగం బాహుబలిలో కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం లభించనుంది. 
 
ఈ నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఓ కార్యక్రమంలో పాల్గొని 'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు. ముఖ్యంగా దేవసేన, అమరేంద్ర బాహుబలిల మధ్య సాగే సన్నివేశాలను, దేవసేన, శివగామిల పాత్ర తీరు తెన్నులను బహిర్గతం చేశారు. 
 
ఈ చిత్రంలో అమరేంద్ర బాహుబలి సవతి తల్లిగా శివగామి అద్భుత నటనను కనబరిచారన్నారు. దేవసేనను అమరేంద్ర బాహుబలి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని, దేవసేన, శివగామి మధ్య నడిచే సుమారు 30 నిమిషాల సన్నివేశాలు చిత్రానికి ఎంతో కీలకమన్నారు. ఈ పాత్రలు తన చిత్రంలో ఉండటం అదృష్టమని, వీరు సినిమాకు ఎంతో బలమని అన్నారు. 
 
ఇకపోతే.. బాహుబలిని మినీ టీవీ సీరియల్‌గా రూపొందించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రసారమవుతున్న టీవీ సీరియళ్లకు భిన్నంగా 13 ఎపిసోడ్లతో మినీ టీవీ సీరియల్‌ను రూపొందించాలనుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
 
ప్రముఖ రచయిత నీలకంఠన్ బాహుబలి సినిమా కథకు ముందస్తు ఘట్టాలతో (ప్రీక్వెల్) మూడు భాగాలుగా ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ అనే పేరుతో పుస్తకం రాస్తున్నారు. ఇందులో భాగంగా తొలి పుస్తకాన్ని రాజమౌళి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలకంఠన్ రాసిన పుస్తకాన్ని చదివానని, అందులోని ప్రతిపాత్ర తనను ఆకట్టుకుందని అన్నారు. శివగామి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని కితాబిచ్చారు. దీని ఆధారంగా మినీ టీవీ సీరియల్ నిర్మిస్తానని తెలిపారు.