1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 జులై 2016 (12:41 IST)

'బాహుబలి'తో తలపడలేక పోయిన 'సుల్తాన్' : ఫస్ట్ డే కలెక్షన్లలో ప్రభాస్ సేఫ్!

ప్రభాస్ హీరోగా, రానా ప్రత్యర్థిగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం అన్ని రకాల రికార్లను తిరగరాసిసింది. ఈ రికార్డలను చేరుకునే టచ్ చేసే దమ్మున్న హీరో ఇప్పట్లో కని

ప్రభాస్ హీరోగా, రానా ప్రత్యర్థిగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం అన్ని రకాల రికార్లను తిరగరాసిసింది. ఈ రికార్డలను చేరుకునే టచ్ చేసే దమ్మున్న హీరో ఇప్పట్లో కనిపించడం లేదు.
 
అయితే, సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్‌లో విడుదలైన చిత్రం 'సుల్తాన్'. ప్రస్తుతం ఇది కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో 'బాహుబలి' రికార్డును అధికమిస్తుందని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. 
 
కానీ, వాస్తవంలో అలా జరగలేదు. మొదటి రోజు ‘బాహుబలి’ రూ.42.3 కోట్లు వసూలు చేస్తే ‘సుల్తాన్‌’ రూ.37.2 కోట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. దీంతో బాహుబలి ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డ్ సేఫ్ అయింది.