శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (11:29 IST)

బాహుబలి-2.. ప్రభాస్ న్యూ లుక్ చూడండి.. ఏనుగుపై నిల్చుని శివుడు ఏం చేస్తున్నాడు..(ఫోటో)

ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి-2' విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో బాహుబలి-2 టెక్నికల్ టీమ్ రాష్ట్రమంతా పర్యటిస్

ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి-2' విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో బాహుబలి-2 టెక్నికల్ టీమ్ రాష్ట్రమంతా పర్యటిస్తోంది. రీసెంట్‌గా కాకినాడ ఈ టీమ్ చేరుకుంది. కాకినాడ లోని.. నాగమల్లితోట జంక్షన్‌ సమీపంలోని లాల్‌బహుద్దూర్‌ నగర్‌ మిర్చి రెస్టారెంట్‌లో విజువల్‌ రియాల్టీ ఎఫెక్ట్స్‌ను ప్రదర్శించారు. 
 
బాహుబలి-2 చిత్రాన్ని విజువల్‌ రియాల్టీలో చూడడం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుందని 'బాహుబలి-2' చిత్రం సాంకేతిక నిపుణుడు కరుణాకరన్‌ చెప్పారు. బాహుబలి-2 చిత్రంలో ఉపయోగించిన అత్యాధునికమైన టెక్నాలజీని ప్రతి ఒక్కరికీ చూపించేలా తమ టీం సభ్యులు రాష్ట్రమంతా ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు.
 
ఇదిలా ఉంటే.. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో 'బాహుబలి: ది బిగినింగ్‌' చిత్రానికి కొనసాగింపుగా 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌'ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ మహాశివరాత్రి సందర్భంగా సినీ యూనిట్ విడుదల చేసింది. ఇకపోతే.. దేశవ్యాప్తంగా 400 సెంటర్లలో బాహుబలి-2 విడుదల కానున్నట్లు తెలిసింది.