101వ సినిమా: 70 ఏళ్లు పైడిన రైతు గెటప్‌లో బాలయ్య అదరగొడతాడా?
నందమూరి బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సంక్రాంతికి రిలీజ్ కానున్న నేపథ్యంలో.. బాలయ్య 101వ సినిమాపై దృష్టి పెట్టేశాడు. ఈ సినిమాను కృష్ణవంశీ తెరెకెక్కిస్తున్నారు. రాష్ట్రంలోని రైతు జీవితం ఆధార
నందమూరి బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సంక్రాంతికి రిలీజ్ కానున్న నేపథ్యంలో.. బాలయ్య 101వ సినిమాపై దృష్టి పెట్టేశాడు. ఈ సినిమాను కృష్ణవంశీ తెరెకెక్కిస్తున్నారు. రాష్ట్రంలోని రైతు జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకి ‘రైతు’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారని సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో బాలయ్య 70 ఏళ్ళు పైబడిన రైతు గెటప్‌లో కనిపించబోతున్నాడట.
ఇంతకు మునుపు కూడా బాలయ్య ‘ఒక్కమగాడు’ వంటి చిత్రాల్లో వయసు పైబడ్డ వ్యక్తిగా కనిపించినప్పటికీ ఈ రైతు సినిమాలో గెటప్ మాత్రం చాలా సహజంగా, ప్రత్యేకంగా ఉంటుందట. బాలయ్య చేస్తున్న ఈ ప్రయోగం ఆయన కెరీర్లోనే ప్రత్యేకమని సినీ జనం చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని ఓ పాపులర్ సంస్థ నిర్మిస్తుందని తెలిసింది.
ఇప్పటికే బాలయ్య, కృష్ణ వంశీ కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌లో ఉన్న అమితాబ్ ను కలిసినప్పటి నుండి బాలయ్య 101వ సినిమాలో అమితాబ్ నటించనున్నాడని కూడా ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.