ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 22 ఆగస్టు 2017 (12:55 IST)

ఆ ఫోజ్‌లో నయనతారను రెండు లక్షల మంది చూసేశారట..!

సింహా, శ్రీరామరాజ్యం సినిమాలో బాలక్రిష్ణ, నయనతారల కాంబినేషన్ అదుర్స్. ఇదే విషయాన్ని తెలుగు సినీరంగంలోని వారందరూ చెబుతుంటారు. వీరి కలయికలో మరో సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. అదే బాలక్రిష్ణ 102వ సినిమా. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఈ స

సింహా, శ్రీరామరాజ్యం సినిమాలో బాలక్రిష్ణ, నయనతారల కాంబినేషన్ అదుర్స్. ఇదే విషయాన్ని తెలుగు సినీరంగంలోని వారందరూ చెబుతుంటారు. వీరి కలయికలో మరో సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. అదే బాలక్రిష్ణ 102వ సినిమా. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఈ సినిమాలో నయనతార కొత్త లుక్‌లో కనిపించనున్నారట. గతంలో ఎప్పుడూ చేయని క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుందంటున్నారు ఆ సినిమా యూనిట్.
 
అయితే నయనతార ఎలాంటి లుక్‌తో కనిపిస్తారనేది మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఇప్పుడే బయటకు వస్తే సినిమా విడుదల సమయంలో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపించదనేది చిత్ర యూనిట్ ఆలోచన. అందుకే నయనతార లుక్‌ను చూపించడం లేదట. కానీ ఆ సినిమా డిజైనర్ నీరజ షూటింగ్ సమయంలో నయనతార కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్లో ట్వీట్ చేశారట. ఈ ఫోటోను గంటలోనే రెండు లక్షల మంది చూసేశారట. ఇప్పుడు నయనతార కొత్త లుక్ ఫోటో తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.