గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 4 ఆగస్టు 2017 (03:11 IST)

ఉయ్యాలవాడ సినిమా పేరు మహావీర.. అమితాబ్ బచ్చన్.. ఐశ్వర్యరాయ్. నటులు.. సినిమా రేంజ్ ఏంటి..!

ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్‌లో ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం కోసం జాగ్రత్తగా అడుగు కదుపుతున్నాడు. వందకోట్ల వసూళ్ల సాధించిన తొలి మెగా ఫ్యామిలీ హీరోగా అదరగొట్టిన చిరంజీవి ఆంగ్లేయుల మీద తిరగబడ్డ

ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్‌లో ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం కోసం జాగ్రత్తగా అడుగు కదుపుతున్నాడు. వందకోట్ల వసూళ్ల సాధించిన తొలి మెగా ఫ్యామిలీ హీరోగా అదరగొట్టిన చిరంజీవి ఆంగ్లేయుల మీద తిరగబడ్డ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో నేరుగా కొండను ఢీకొడుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రం  త్వరలో సెట్స్ మీదకు వెళుతున్న నేపథ్యంలో ఈ సినిమాలోని కీలక పాత్రల గురించి చాలా చాలా వార్తలు వినిపిస్తున్నాయి.
 
చిరుకు జోడిగా బాలీవుడ్ బ్యూటి ఐశ్వర్యారాయ్ నటిస్తోందని, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఈ సినిమాలో కీలక పాత్రకు అంగీకరించారన్న వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఉయ్యాలవాడ సినిమాలో కన్నడ స్టార్ హీరో సుధీప్ కీలక పాత్రలో నటించేందుకు అంగీకరించాడట. 
 
త్వరలో సెట్స్ మీద కు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చిరుకు జోడిగా బాలీవుడ్ బ్యూటి ఐశ్వర్యారాయ్ నటిస్తోందని, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఈ సినిమాలో కీలక పాత్రకు అంగీకరించారన్న వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.
 
ఈగ, బాహుబలి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సుధీప్ ఇమేజ్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మల్టీ లాంగ్వేజ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతర భాషా నటులను తీసుకునేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తుంది. అన్ని భాషల్లో కలిసొచ్చేలా సినిమాకు మహావీర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే అంచనాలను మించిపోయిన ఉయ్యాలవాడ సినిమాలో అమితాబ్ ఆయన కోడలు ఐశ్వర్య నటిస్తున్నారన్న వార్త సంచలనం సృష్టిస్తోంది.