శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (08:57 IST)

#HBDMegastarChiranjeevi : జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి.. మీ పరుచూరి బ్రదర్స్

మెగాస్టార్ జీవించివి పరుచూరి బ్రదర్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జనజీవిగా సినీ ప్రేక్షకుల గుండెల్లో 'ఖైదీ'లా మారిన చిరంజీవి 61వ పుట్టినరోజు వేడుకలను మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సం

మెగాస్టార్ జీవించివి పరుచూరి బ్రదర్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జనజీవిగా సినీ ప్రేక్షకుల గుండెల్లో 'ఖైదీ'లా మారిన చిరంజీవి 62వ పుట్టినరోజు వేడుకలను మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవికి పరుచూరి బ్రదర్స్ జన్మదిన శుభకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
 
""'ఖైదీ' నుంచి 'ఖైదీ నంబర్ 150' వరకు మీతో చేసిన సినీ ప్రయాణం మరువలేనిది. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పాత్రధారణతో మీ వెండితెర జీవితం సువర్ణాక్షరాలతో లఖించబడుతుంది. తొలి స్వాతంత్ర్య సమరయోధుడి చరిత్రను, ధరిత్రికి తెలియజేసే అవకాశం మీతో పాటు మాకూ లభించడం మా అదృష్టం. ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అద్భుత నటజీవితం, ప్రజల ఆశీస్సులు మీకు సదా లభించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారు"".. మీ పరుచూరి సోదరులు అంటూ పరుచూరి గోపాలకృష్ణ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.