శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (18:10 IST)

''అర్జున్ రెడ్డి'' లిప్ లాక్ పోస్టర్.. చించేసిన వీహెచ్.. తాతయ్యా ''చిల్'' అంటూ ఎమోజీ.. (ఫోటోలు-ట్రైలర్)

పెళ్ళి చూపులు ఫేమ్ హీరో విజయ్ దేవరకొండ తాజా సినిమా ''అర్జున్ రెడ్డి'' వివాదాల చుట్టూ తిరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా.. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డు గుర్

పెళ్ళి చూపులు ఫేమ్ హీరో విజయ్ దేవరకొండ తాజా సినిమా ''అర్జున్ రెడ్డి'' వివాదాల చుట్టూ తిరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా.. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డు గుర్రుగా వుంది. ముద్దు, రొమాన్స్ సీన్లు ఎబ్బెట్టుగా వున్నాయని వాటిని తొలగించాలని సెన్సార్ వెల్లడించింది. తాజాగా అర్జున్ రెడ్డి పోస్టర్లు ప్రస్తుతం కొత్త వివాదానికి దారితీశాయి. 
 
తెలంగాణలోని బస్టాండ్లు, బస్సులపై అర్జున్ రెడ్డి పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ హీరోయిన్‌తో లిప్ లాక్ చేసే ఫోటోను అతికించేయడంతో వివాదం రాజుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పోస్టర్లు అతికించడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఓ ఆర్టీసీ బస్సుపై ఉన్న'అర్జున్ రెడ్డి' సినిమా పోస్టర్ అసభ్యంగా ఉందంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ దానిని చింపివేయడంపై ఈ చిత్రం హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. తన ట్విట్టర్ వేదికగా ''తాతయ్యా.. చిల్'' అంటూ నవ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు.
 
కాగా నాంపల్లిలోని గాంధీభవన్‌లో జరిగిన ఓ సమావేశానికి హాజరైన వీహెచ్ తిరుగు ప్రయాణంలో వెళ్తూ.. ఓ ఆర్టీసీ బస్సుపై అర్జున్ రెడ్డి పోస్టర్‌ను చూసి అవాక్కయ్యారు. దీంతో, వెంటనే ఆ బస్సును ఆపించి కండక్టర్ సాయంతో ఆ పోస్టర్‌ను తొలగించి వేశారు. ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయంపై విజయ్ దేవరకొండ స్పందించారు. డబ్బు కోసం ఇలాంటి ఫోటోలను ప్రభుత్వ బస్సులపై, బస్టాండ్ బోర్డింగులపై వేయడాన్ని వీహెచ్ తప్పుబట్టారు. 
 
కాగా.. సెన్సార్ బోర్డ్ నుంచి ఇప్పటికే ''ఎ'' సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రం ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించారు. అర్జున్ రెడ్డి సినిమాలో శాలిని అనే కొత్త అమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.