శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: బుధవారం, 26 సెప్టెంబరు 2018 (18:39 IST)

బోయ‌పాటితో సినిమా కోసం ప‌క్కా ప్లాన్ రెడీ చేసిన బాల‌య్య‌..!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల బాల‌య్య‌, సుమంత్‌లపై కీల‌క స‌న్నివేశాలను చిత్ర‌క‌రించారు. సంక్రాంతి కానుక‌గా జ

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల బాల‌య్య‌, సుమంత్‌లపై కీల‌క స‌న్నివేశాలను చిత్ర‌క‌రించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో బాల‌య్య సినిమా చేయ‌నున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.
 
అయితే.. ఈ సినిమా గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... బాల‌య్య ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ డిసెంబ‌ర్ కి పూర్త‌వుతుంది. ఇక బోయ‌పాటి చ‌ర‌ణ్ తో చేస్తున్న సినిమా కూడా డిసెంబ‌ర్ కి పూర్త‌వుతుంది. అందుచేత బాల‌య్య‌, బోయ‌పాటి క‌లిసి చేయ‌నున్న సినిమాని న‌వంబ‌ర్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించి డిసెంబ‌ర్ నుంచి కంటిన్యూస్ గా షూటింగ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఫిబ్ర‌వ‌రికి షూటింగ్ కంప్లీట్ చేయాల‌ని ప‌క్కా ప్లాన్ రెడీ చేసార‌ట‌. 
 
ఎందుకంటే... ఆత‌ర్వాత ఎన్నిక‌లు వ‌స్తుండ‌డంతో బాల‌య్య బిజీ. అందుచేత బాల‌య్య - బోయ‌పాటి మూవీకి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంద‌ట‌. మ‌రి..బాల‌య్య‌ను బోయ‌పాటి సింహ‌, లెజెండ్ చిత్రాల్లో ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా చూపించాడో చూసాం. మ‌రి.. ఈసారి ఎలా చూపిస్తాడో చూడాలి.