సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 13 సెప్టెంబరు 2018 (12:03 IST)

ఎన్టీఆర్ : న్యూ లుక్ అదిరిపోయింది... ఎన్టీఆర్‌తో రానా చంద్రబాబు

స్వర్గీయ ఎన్.టి. రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన న్యూ లుక్‌ను త

స్వర్గీయ ఎన్.టి. రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన న్యూ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. అదీ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేశారు.
 
1984వ సంవత్సరంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఎన్టీఆర్‌తో నారా చంద్రబాబు కలిసి ఉన్న సీన్‌కు సంబంధించిన ఫొటోను రిలీజ్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రానా, విద్యాబాలన్ తదితరులు నటిస్తున్నారు. 
 
అలాగే, వినాయకచవితికి ఒక్కరోజు ముందు... నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న హీరో రానా దగ్గుబాటి లుక్‌ను విడుదలచేశారు. యుక్త వయసులో చంద్రబాబు ఎలా ఉండేవారో అచ్చు అలానే ఉండేలా రానాకు మేకోవర్ చేయించారు. దాన్ని బుధవారం రిలీజ్ చేశారు. ఆ లుక్ చూస్తుంటే 80వ దశకంలోని చంద్రబాబుని చూసినట్టే ఉంది. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయారు రానా. ప్రేక్షకుల నుండి దీనికి మంచి ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరులతో కలిసి బాలకృష్ణ నటిస్తున్నారు.