శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 12 సెప్టెంబరు 2018 (17:34 IST)

'బాహుబలి' రానా ఎక్కడ... ఎన్టీఆర్ బయోపిక్ 'బాబు' రానా ఎక్కడ?

రానా.... పాత్ర డిమాండ్ మేరకు శక్తివంచన లేకుండా కృషి చేసే నటుల్లో ఒకరు. నిజానికి ఇంతగా రిస్క్ చేసి నటించేవారు చాలా కొద్దిమంది వుంటారు. అలాంటివారి జాబితాలో రానా చేరిపోయారు. బాహుబలి చిత్రంలో రానా కండలు తిరిగి, ఆతడిని చూస్తేనే జడుసుకునేలా బాడీని పెంచి హడ

రానా.... పాత్ర డిమాండ్ మేరకు శక్తివంచన లేకుండా కృషి చేసే నటుల్లో ఒకరు. నిజానికి ఇంతగా రిస్క్ చేసి నటించేవారు చాలా కొద్దిమంది వుంటారు. అలాంటివారి జాబితాలో రానా చేరిపోయారు. బాహుబలి చిత్రంలో రానా కండలు తిరిగి, ఆతడిని చూస్తేనే జడుసుకునేలా బాడీని పెంచి హడలెత్తించాడు. బాహుబలిలో రానా ఫిజిక్ చూసినవారు అదిరిపోయారు. వామ్మో... రానా ఇలా ఎలా మారిపోయారంటూ మాట్లాడుకున్నారు. బాహుబలిలో భళ్లాలదేవ అంటే భయంతో చిన్నపిల్లలు కూడా వణికిపోయారంటే అతిశయోక్తి కాదు. 
 
ఇక ఇప్పటి సంగతి చూస్తే... ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రను పోషించేందుకు ఆయన ఫిజిక్ మాదిరిగా మారేందుకు రానా చాలా తంటాలు పడ్డారని తాజాగా బయటకి వచ్చిన లుక్ చూస్తే తెలిసిపోతోంది. బక్కపలచగా అచ్చం చంద్రబాబు నాయుడు పర్సనాలిటీతో రానా కనిపిస్తున్నారు. ఈ లుక్ చూసిన నెటిజన్స్ రానాకు హ్యాట్సాఫ్ అంటున్నారు. రానా అంటే రానానే...