శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 11 జనవరి 2025 (14:57 IST)

బాలక్రిష్ణ మెప్పు పొందిన ది సస్పెక్ట్ కథానాయకుడు రుషి కిరణ్

Akhanda getup Rushi Kiran
Akhanda getup Rushi Kiran
"ది సస్పెక్ట్" చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్న ప్రవాస తెలుగు నటుడు "రుషి కిరణ్". "డాకు మహారాజ్"తో ఈ సంక్రాంతికి రాబోతున్న విషయం తెలిసిందే.  అలాంటి బాలయ్య ద్రుష్టిలో రుషి పడ్డాడు. ఇటీవలే అమెరికాలోని డల్లాస్ లో జరిగిన "డాకు మహారాజ్" ప్రి రిలీజ్ ఈవెంట్ లో "అఖండ" గెటప్ తో సందడి చేశాడు బాలయ్య వీరాభిమాని రుషి కిరణ్. ఆ గెటప్పులో అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించడంతోపాటు బాలయ్య మెప్పు సైతం పొందారు. 
 
డల్లాస్ మరియు పరిసర రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారు 7 వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సంక్రాంతికి వస్తున్న "డాకు మహారాజ్" బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయమని రుషి కిరణ్ ఆకాంక్షించారు. రుషి కిరణ్ నటించిన "ది సస్పెక్ట్" చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సంక్రాంతికి విడుదలవుతున్న డాకు మహారాజ్ రిలీజ్ రోజు మరో గెటప్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది.