గేమ్ చేంజర్ నుంచి క్రేజీ డోప్ సాంగ్ వచ్చేసింది
Dopee song- kiyara, charan
డిసెంబర్ 21న యు.ఎస్, డల్లాస్‌లో జరిగిన గేమ్ చేంజర్ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా నుంచి క్రేజీగా సాగే డోప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే ఈ సాంగ్‌ను ఇండియాలో ఈ పాటను ఉదయం 8 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేశారు. డైరెక్టర్ శంకర్ తనదైన శైలిలో మరోసారి మేకింగ్‌లో తనేంటో ఈ సాంగ్‌తో ప్రూవ్ చేశారు.
తమన్ కంపోజిషన్ దీనికి పెద్ద ఎసెట్‌గా మారింది. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను తమిళంలో వివేక్, హిందీలో రక్వీబ్ ఆలం రాశారు. అలాగే తెలుగులో ఈ పాటను తమన్ ఎస్, రోషిణి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించాగా.. తమిళంలో తమన్ ఎస్, అదితీ శంకర్, పృథ్వీ.. హిందీలో తమన్ ఎస్, రాజకుమారి, పృథ్వీ శ్రుతి రంజని ఆలపించారు. పాటకు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. పాటలో అక్కడక్కడ రామ్ చరణ్, కియారా అద్వానీ వేసిన డాన్స్ ఎంతో క్యూట్‌గా ఉంది.
ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ నుంచి రిలీజైన .. జరగండి, రా మచ్చా మచ్చా, నా నా హైరానా అనే పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటి సరసన డోప్ సాంగ్ ప్రేక్షకులను మెప్పిస్తోంది.
గేమ్ చేంజర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. పక్కా ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. గేమ్ చేంజర్ చిత్రానికి సరిగమ ఆడియో పార్టనర్స్‌గా వ్యవహరిస్తున్నారు.
రామ్ చరణ్.. గేమ్ చేంజర్ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.యు.వెంకటేశన్, వివేక్ రైటర్స్‌గా వర్క్ చేశారు. హర్షిత్ సహ నిర్మాత. ఎస్.తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ, ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. నరసింహా రావు.ఎన్, ఎస్.కె.జబీర్ లైన్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా అవినాష్ కొల్ల, యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా అన్బరివు, డాన్స్ డైరెక్టర్‌గా ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వర్క్ చేస్తున్నారు. రామ్ జోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ పాటలను రాశారు.