రాంగోపాల్ వర్మ ఓ కుక్క... పవన్ చెప్పుకు ఉన్న విలువ కూడా లేదు : మండిపడ్డ బండ్ల గణేష్
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం ఈనెల 24వ తేదీన విడుదలైంద. ఈ చిత్రం విడుదల సందర్భంగా వర్మ ట్వీట్స్ చేస్తూ.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం ఈనెల 24వ తేదీన విడుదలైంద. ఈ చిత్రం విడుదల సందర్భంగా వర్మ ట్వీట్స్ చేస్తూ... పవన్ మూడు పెళ్లిల్ల గురించి, కూతుళ్ల గురించి కూడా ప్రస్తావించి వ్యక్తిగత విమర్శలు చేశాడు. దీంతో పవన్ భక్తుడు బండ్ల గణేష్ కూడా వర్మపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘మిస్టర్ రాము, పవన్‌కల్యాణ్‌ను విమర్శించే ముందు నీ నోటిని అదుపులో పెట్టుకో. నీకు పవన్ కల్యాణ్ చెప్పుకున్న విలువ కూడా లేదు’ అని ట్వీట్ చేశాడు. అనంతరం ‘వీధిలో అరిచే కుక్క కంటే నువ్వు ఎక్కువ కాదు. నువ్వు దేశంలో ఓ నల్ల గొర్రెవి. నువ్వు భారతీయుడవని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. మా ఏరియాలోకి ఎంటర్ అయితే నిన్ను క్షమించం. నువ్వు ఎక్స్‌పైర్ అయిపోయిన టాబ్లెట్‌లాంటివాడివి. నువ్వు పిచ్చి ఆస్పత్రిలో చేరాలని కోరుకుంటున్నాం’ అంటూ వరుసగా రిప్లైలు ఇచ్చి సరికొత్త మాటల యుద్ధానికి దారితీశాడు.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ ‘కాటమరాయుడు’ సినిమా చూడటం కంటే ఓ పోర్న్ సినిమా చూడడం మేలని తనతో ఓ 70 ఏళ్ల వ్యక్తి అన్నట్టు ట్వీట్ చేశాడు. అభిమానులు వెర్రిగా, భ్రమలో ఉండటం వల్లే వారి నాయకులు కూడా ఇలా తయారవుతున్నారని చెప్పేశాడు. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కంటే ఓ మంచి సినిమా ఇస్తే మేలని వర్మ ట్వీట్లు చేశాడు. అంతేకాదు పవన్ అభిమానులను గేదెలతో పోల్చాడు. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.